TS High Court: అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా?

తాజా వార్తలు

Updated : 01/06/2021 14:19 IST

TS High Court: అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా?

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌: గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ఠ ధరలను సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? కొత్త ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? అని ప్రశ్నించింది. 

మరికొన్ని ఆదేశాలు అమలు చేశారో లేదో నివేదికలో వివరించలేదని.. మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తు చేసింది. అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని పేర్కొంది. డీహెచ్ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కరోనా పరిస్థితులపై విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని