Lockdown: తెలంగాణలో అమల్లోకి..
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: తెలంగాణలో అమల్లోకి..

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. సడలింపులు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సమయం దగ్గర పడటంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు బోసిపోయాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. పలు ప్రాంతాల్లో రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో బాలానగర్‌ డీసీపీ పద్మజ ఆధ్వర్యలో పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలు ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఉప్పల్‌, మేడిపల్లిలో లాక్‌డౌన్‌ పరిస్థితిని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు. వరంగల్‌ జిల్లా గీసుకొండలో పోలీసులు తనిఖీలు నిర్వహించి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

 హైదరాబాద్‌లో పూర్తిగా లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.  ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ రెండో డోసు కోసం ఆస్పత్రుల వద్దకు తరలివచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆస్పత్రులకు వచ్చి వెళ్లేవారికి ఆటంకం కలిగించొద్దని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని