ఆర్టీసీ ద్వారా రిటైల్‌ ఇంధన అమ్మకాలు

తాజా వార్తలు

Published : 07/08/2020 03:00 IST

ఆర్టీసీ ద్వారా రిటైల్‌ ఇంధన అమ్మకాలు

ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 

హైదరాబాద్‌: టికెటేతర ఆదాయ వనరులపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పటికే కార్గో, పార్సిల్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ.. ఇప్పుడు మరో ఆదాయ మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ద్వారా రిటైల్ ఇంధన అమ్మకాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దిశలో భాగంగా ప్రథమంగా ఇవాళ జనగామలోని అవుట్‌లెట్ (పెట్రోల్ బంకు)ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఆర్టీసీ స్వయం సమృద్ధి సాధించడానికి ఉన్న వనరులన్నింటినీ అన్వేషించి కార్గో సేవలను ఇప్పటికే ప్రారంభించిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. సంస్థ ఆర్థిక పరిపుష్టికి రిటైల్ ఇంధన వ్యాపారాన్ని ఆర్టీసీ చేపట్టిందనని చెప్పారు. హన్మకొండ, మహబూబాబాద్‌, బిచ్కుంద, బీర్కూర్, ఆసిఫాబాద్‌లలో మొత్తం 5 అవుట్‌లెట్లను ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పువ్వాడ తెలిపారు. టీఎస్‌ ఆర్టీసీ, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ భాగస్వామ్యంతో ఇంధనం అమ్మకాల వ్యాపారాన్ని ప్రత్యక్షంగా నిర్వహించడానికి ఎంవోయూ చేసుకుందని మంత్రి పువ్వాడ తెలిపారు. రిటైల్ ఇంధన కార్యకలాపాలను టీఎస్‌ ఆర్టీసీ స్వయంగా నిర్వహించడం వల్ల ఆర్టీసీకి సుమారు నెలకు రూ.20.65 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని