కొత్తఏజెన్సీకి చెల్లింపులు తక్కువే: తితిదే ఏఈవో

తాజా వార్తలు

Updated : 03/07/2021 12:24 IST

కొత్తఏజెన్సీకి చెల్లింపులు తక్కువే: తితిదే ఏఈవో

తిరుమల: తిరుమలలో భక్తులకు సేవలందించే వివిధ సేవా కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ‘‘భక్తులకు సేవలందించడానికి కరోనాకు ముందు 176 కౌంటర్లు ఉండేవి. పదేళ్లుగా త్రిలోక్‌ ఏజెన్సీ తితిదే కౌంటర్లను నడిపింది. సామాజిక ప్రకటనలతో త్రిలోక్‌ సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకునేది. ఏడాదిన్నర ముందు త్రిలోక్‌ సంస్థ కౌంటర్లు నిర్వహించలేమంది. ఏడాదిన్నరగా మరో ప్రైవేటు సంస్థకు అప్పగించాం. ఏడాది ముందు లడ్డూ కేంద్రంలో బ్యాంకుల ద్వారా 25 కౌంటర్లు నడిచేవి. ఏడాదిగా బ్యాంకులు 9 కేంద్రాలే నిర్వహిస్తున్నాయి. బ్యాంకు ద్వారా నిర్వహించే కౌంటర్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులొచ్చాయి. పాత ఏజెన్సీ కంటే తక్కువ మొత్తాలే కొత్త ఏజెన్సీకి చెల్లిస్తున్నాం. నూతన ఏజెన్సీ ద్వారా రూ.56 లక్షలు తక్కువగా ఖర్చవుతోంది’’ అని ధర్మారెడ్డి అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని