TTD Board members: తితిదే నూతన పాలకమండలి సభ్యుల జాబితా విడుదల

తాజా వార్తలు

Updated : 16/09/2021 06:25 IST

TTD Board members: తితిదే నూతన పాలకమండలి సభ్యుల జాబితా విడుదల

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మంది సభ్యులతో కూడిన తితిదే కొత్త పాలకమండలి ఏర్పాటు అయింది. తితిదే సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాటసాని రాం భూపాల్‌రెడ్డి(ఎమ్మెల్యే), టంగుటూరు మారుతి ప్రసాద్‌, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(ఎమ్మెల్యే), కలివేటి సంజీవయ్య(ఎమ్మెల్యే), డా.జూపల్లి రామేశ్వరరావు, మన్నె జీవన్‌రెడ్డి, బుదాటి లక్ష్మీనారాయణ, పార్థసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(ఎమ్మెల్యే), శ్రీనివాసన్, నందకుమార్‌, శశిధర్‌, విశ్వనాథ్‌రెడ్డి, మిలింద్‌, సౌరభ్‌, కేతన్‌ దేశాయ్‌, రాజేశ్‌ శర్మ, సనత్‌ కుమార్‌, అల్లూరు మల్లేశ్వరి, ఎస్‌.శంకర్‌ పాలకమండలిలో నియామకమయ్యారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా రెవెన్యూ శాఖ కార్యదర్శి(దేవాదాయ), దేవాదాయ శాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, తితితే ఈవో నియామకమయ్యారు. తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌ నియామకమయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని