ఆధారాలు చూపితే పునరాలోచిస్తాం: తితిదే ఈవో
close

తాజా వార్తలు

Published : 05/06/2021 17:16 IST

ఆధారాలు చూపితే పునరాలోచిస్తాం: తితిదే ఈవో

తిరుపతి: తితిదే చూపుతున్న ఆధారాలకంటే బలమైన ఆధారాలు ఎవరైనా చూపితే హనుమ జన్మస్థలంపై పునరాలోచిస్తామని, అప్పటి వరకు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రేనని తితిదే ఈవో జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో మొక్కలు నాటారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఈవో.. హనుమంతుని జన్మస్థలంపై చోటు చేసుకొన్న వివాదాలు త్వరలోనే సద్దుమణుగుతాయన్నారు. జపాలి నుంచి ఆకాశగంగకు జన్మస్థలం మార్చటంపై స్పందించిన ఈవో.. అంజనాద్రిలో జపాలి, ఆకాశగంగ తీర్థాలు పక్క పక్కనే ఉన్నాయన్నారు. గోవిందానంద సరస్వతీ స్వామి తితిదేపై విమర్శలకు పరిమితం అవుతున్నారని, ఆయన చూపిన ఆధారాలు సరిగా లేవని ఈవో అభిప్రాయపడ్డారు. తితిదే చూపుతున్న ఆధారాలకంటే బలమైన ఆధారాలు చూపితే అంజనాద్రి హనుమజన్మస్థానంపై పునరాలోచిస్తామని తెలిపారు. అప్పటి వరకు అంజనాద్రి హనుమ జన్మస్థానమని ఆయన స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని