AP News: హ‌నుమ జ‌న్మ‌స్థ‌లం అదే
close

తాజా వార్తలు

Updated : 05/06/2021 13:37 IST

AP News: హ‌నుమ జ‌న్మ‌స్థ‌లం అదే

తితిదే ఈవో స్ప‌ష్టం

తిరుమ‌ల‌: అంజ‌నాద్రే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(తితిదే) ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే దీనిపై వ‌స్తున్న అన్ని వివాదాలు స‌ర్దుకుంటాయ‌ని చెప్పారు. అంజ‌నాద్రే హ‌నుమ జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తితిదే వ‌ద్ద ఉన్న ఆధారాలు చూపామ‌న్నారు. ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థ‌లంపై గోవిందానంద స‌ర‌స్వ‌తి చూపిన ఆధారాలు స‌రిగా లేవ‌ని చెప్పారు. తితిదే కంటే బ‌ల‌మైన ఆధారాలు ఎవ‌రైనా చూపిస్తే అప్పుడు ఈ విష‌యంపై పునారాలోచ‌న చేస్తామ‌ని తెలిపారు. అప్ప‌టి వ‌ర‌కూ హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లం అంజ‌నాద్రే అని వివ‌రించారు. తిరుప‌తి క‌ర‌కంబాడి రోడ్డులో 10 వేల మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ఇవాళ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తితిదే ఈవో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంపై నెలకొన్న వివాదంపై మీడియాతో మాట్లాడారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని