TTD: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచిన తితిదే

తాజా వార్తలు

Published : 20/09/2021 01:48 IST

TTD: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచిన తితిదే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాకు చెందిన వారికే రెండు వేల టోకెన్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 8వేలకు పెంచి అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. పెరటాసి నెల కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్యంగా డిమాండ్‌ పెరిగడంతో తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి భక్తుడు సర్వదర్శనం టోకెను పొందే అవకాశం కల్పించారు. ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆరోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేయనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని