కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా తితిదే కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Updated : 07/04/2021 19:50 IST

కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా తితిదే కీలక నిర్ణయం

తిరుమల: కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి శ్రీవారి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని  పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే.. ఈ కౌంటర్ల క్యూలైన్ల వద్దకు భక్తులు గుంపులుగా చేరుతుండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని తితిదే భావించింది.

ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే జారీ చేస్తామని తెలిపింది. 12వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి సర్వదర్శన టోకెన్ల జారీపై వివరాలను ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని తితిదే స్పష్టం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని