సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22మందికి కరోనా

తాజా వార్తలు

Updated : 02/01/2021 13:29 IST

సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22మందికి కరోనా

సుర్యాపేట (నేరవిభాగం): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి గేటెడ్‌ కమ్యూనిటీలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకింది. గేటెడ్ కమ్యూనిటీలోని ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు పెద్దఎత్తున బంధువులు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన కొంతమందిలో కరోనా లక్షణాలు బయటపడటంతో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 38 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 22 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో డా.హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. కరోనా సోకిన 22 మందిలో ఎవరికీ స్ర్టెయిన్‌ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు హాజరై తదుపరి కార్యక్రమాలకు ఒకే ఇంట్లో నివాసం ఉన్న సమీప బంధువులకే వైరస్‌ సోకినట్లు గుర్తించామన్నారు. ప్రత్యేక వైద్యబృందం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇవీ చదవండి..

భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసులు @29

దీదీకి మరో షాక్‌! 5వేల మందితో భాజపాలోకి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని