ఏనుగును ఎలా కొట్టారో చూడండి!

తాజా వార్తలు

Published : 23/02/2021 01:05 IST

ఏనుగును ఎలా కొట్టారో చూడండి!

తమిళనాడు: ఇద్దరు వ్యక్తులు ఓ ఏనుగును తీవ్రంగా హింసించి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూర్‌లోని మెట్టుపాలాయం ఏనుగుల పునర్వికాస కేంద్రంలో చోటు చేసుకుంది. ఏనుగుల పునర్వికాసానికి తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి 26 గజరాజులతోపాటు శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన ఏనుగు జై మాల్యదను తీసుకెళ్లారు. అయితే, జైమాల్యదపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఓ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

స్పందించిన హిందూ రెలీజియస్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్స్‌ ట్రస్ట్‌ ఈ ఘటనపై దర్యాప్తు చేసింది. ఏనుగు గొలుసు తెంచుకొని తప్పించుకునేందుకు యత్నించిందని.. మావటి కాలు తొక్కిందని నిందితులు చెప్పారు. అదుపు చేయకపోతే ఇతరులకు ప్రమాదం అనే ఉద్దేశంతోనే ఏనుగును కొట్టినట్లు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం దాడికి పాల్పడిన వినిల్‌ కుమార్‌ అనే మావటిని తొలగించాలని ట్రస్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మావటితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని