ఏపీ సచివాలయ ఉద్యోగులు మరో ఇద్దరు మృతి 

తాజా వార్తలు

Updated : 19/04/2021 14:01 IST

ఏపీ సచివాలయ ఉద్యోగులు మరో ఇద్దరు మృతి 

అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. పంచాయతీరాజ్‌శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ శాంతి కుమారి కరోనాతో మృతిచెందగా.. హోంశాఖ రికార్డు అసిస్టెంట్‌ ఏఎస్‌ఎన్ మూర్తి కొవిడ్‌తో మరణించారు. ఈ పరిణామంతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కారణంగా మరోసారి ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు డిమాండ్‌ చేస్తు్న్నారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో సచివాలయంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కొవిడ్‌ భయంతో ఉన్నతాధికారులు విజయవాడ, గుంటూరుల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని