నిరాడంబరంగా ఉగాది వేడుకలు

తాజా వార్తలు

Published : 13/04/2021 13:16 IST

నిరాడంబరంగా ఉగాది వేడుకలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించింది. హైదరాబాద్‌ బొగ్గుల కుంటలోని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నారు. షడ్రుచుల మేళవింపుతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిరాడంబరంగా ఉగాది పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సమష్టిగా పోరాడి, కరోనాపై విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సంతోష్‌కుమార్‌ శాస్ర్తి పంచాంగ శ్రవణం చేశారు. 

‘‘ప్లవ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. అన్ని ప్రభుత్వ రంగాల్లోనూ ఈ ఏడు అభివృద్ధి జరుగుతుంది. మే తర్వాత కరోనా తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు తీసుకోవాలి. భూముల ధరలు ఇష్టారీతిన పెరుగుతాయి. రెండు, మూడు భూముల స్కాంలు బయటపడే అవకాశం ఉంది. ప్రజలు భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకొని అప్పుల జోలికి పోకుండా ఉండాలి’’ అని పంచాంగ శ్రవణంలో వినిపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని