రాజధానిపై అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

తాజా వార్తలు

Updated : 06/08/2020 20:12 IST

రాజధానిపై అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అంశంపై కేంద్రం ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్రల లేదని స్పష్టం చేసింది.

రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పి.వి.కృష్ణయ్య ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణయ్య పిటిషన్‌పై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, వివిధ ప్రజాసంఘాలు, రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. రాజధానికి సంబంధించిన మొత్తం 32 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

అమరావతిపై కీలక వ్యాఖ్యలు..

 రాజధాని నిధుల వ్యయం పిటిషన్‌ త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన సందర్భంగా  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రూ.52వేల కోట్లు ఖర్చు చేశారని సీఆర్డీఏ రికార్డును న్యాయవాది మురళీధర్‌  చూపించగా..మొత్తం వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ‘‘ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ నిర్మాణం ఆగిందో వివరాలు కావాలి. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టం కదా. కట్టిన భవనాలు వాడకుంటే పాడైపోతాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే దీనిపై రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. రూ.52వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? రాజధానిలో కట్టిన భవనాల వివరాలు కావాలని కోరింది. కేసు విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని