‘యప్‌ టీవీ’కి ఐపీఎల్‌ ప్రసార హక్కులు

తాజా వార్తలు

Updated : 17/09/2020 11:59 IST

‘యప్‌ టీవీ’కి ఐపీఎల్‌ ప్రసార హక్కులు

ఇంటర్నెట్‌డెస్క్:  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫం ‘యప్‌ టీవీ’ ఐపీఎల్‌ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు మొత్తం 60 మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్టేడియం వెళ్లి మ్యాచ్‌లు చూసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాంకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే యప్‌ టీవీకి విశేష ఆదరణ లభిస్తుండగా.. ఐపీఎల్‌ 2020తో మరింత పెరుగుతుందని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఆస్ట్రేలియా, యూరప్‌, మలేసియా, ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, మధ్య ఆసియా, దక్షిణఅమెరికా తదితర చోట్ల డ్రీమ్‌ 11 ఐపీఎల్‌ 2020 మ్యాచ్‌లను యప్‌ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

తాజా ఐపీఎల్‌ సీజన్‌తో యప్‌ టీవీ మరింత మందికి చేరువయ్యే అవకాశముందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  తాజా ఐపీఎల్‌ కొంత సంచలనాలకు తావిస్తుంది. ఇన్నాళ్లు కిక్కిరిసిన స్టేడియంలో, ప్రేక్షకుల కేరింతల మధ్య మ్యాచ్‌లు సాగేవి. కానీ, కుటుంబ సభ్యుల మధ్య కూర్చునే అంతటి ఆనందాన్ని పొందేలా యప్‌ టీవీ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. దీంతో ప్రేక్షకుల అనుభూతి రెట్టింపవుతుంది.అంతేకాకుండా యప్‌ టీవీ సత్తాను నిరూపించుకునేందుకు ఈ ఐపీఎల్‌ మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నాం’’ అని ఉదయ్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.

దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులకు సేవలందిస్తున్న ఈ సంస్థ.. 14 ప్రముఖ భారతీయ భాషల నుంచి దాదాపు 250కి పైగా టీవీ ఛానళ్లను, 3000లకు పైబడి సినిమాలను , వందకు పైగా టీవీ షోలను ప్రసారం చేస్తోంది. ప్రపంచ నెంబర్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాంగా ఎదిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని