TS news: 28 నుంచి సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సిన్‌!

తాజా వార్తలు

Updated : 25/05/2021 17:45 IST

TS news: 28 నుంచి సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సిన్‌!

హైదరాబాద్‌: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు ప్రత్యేక టీకా డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది. సూపర్‌ స్ప్రెడర్ల గుర్తింపు కోసం విధివిధానాలు ఖరారు చేయాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు వ్యాక్సినేషన్‌పై సీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు టీకా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మందిని సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించారు. మొదట జీహెచ్‌ఎంసీలోని సూపర్‌ స్ప్రెడర్లకు టీకాలు వేయనున్నారు. 

సూపర్‌ స్ప్రెడర్లు వీరే: ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, బస్‌ డ్రైవర్లు, హోటళ్లు, సెలూన్ల సిబ్బంది, కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారులు, హమాలీలు, కిరాణా, మాంసాహార దుకాణదారులు, రేషన్‌ డీలర్లు, ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా సిబ్బంది, మద్యం దుకాణాల్లో అమ్మకందారులు తదితరులను సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించారు.

ప్రైవేటు సంస్థల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతి

మరోవైపు, ప్రైవేటు సంస్థల్లో వ్యాక్సినేషన్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి పని ప్రదేశాల్లోనే టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. వ్యాక్సినేషన్‌కు ప్రైవేటు ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలన్న అధికారులు.. 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని