Ap news: వంశధార రెండు రాష్ట్రాలకు చెరి సగం
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 20:17 IST

Ap news: వంశధార రెండు రాష్ట్రాలకు చెరి సగం

అమరావతి: నదీ జలాలు, నేరడి ప్రాజెక్టుకు భూసేకరణపై వంశధార ట్రైబ్యునల్‌ ఇవాళ విచారణ జరిపింది. ఈ మేరకు రెండు మధ్యంతర పిటిషన్లపై ఉత్తర్వులు ఇచ్చింది.  ఏపీ కోరినట్లు నేరడి ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌కు అవసరమైన 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించాలని పేర్కొంది. తగ్గినా, పెరిగినా వంశధార జలాలను 2 రాష్ట్రాలు చెరి సగం వాడుకోవాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది. 115 టీఎంసీ అంచనాలతో 2 రాష్ట్రాల మధ్య గతంలోనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరురాష్ట్రాల విభేదాల సమీక్షాధికారం కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి ఉంటుందని చెప్పింది. ఇందుకు కోసం ప్రత్యేకంగా అప్పీల్‌ అథారిటీ ఏర్పాటు అవసరం లేదని ట్రైబ్యునల్‌ పేర్కొంది. ఏపీ ప్రతిపాదించినట్లు 106 ఎకరాల్లో ప్రాజెక్టు సాధ్యం కాదని ఒడిశా వాదనలు వినిపించింది. ఇప్పటి వరకు తమకు నేరడి ప్రాజెక్టు సమగ్ర ప్లాన్‌ కూడా ఇవ్వలేదని ట్రైబ్యునల్‌కు వివరించింది. నేరడి నీటి పంపకాలపై స్పష్టత  కావాలని కేంద్రం గతంలోనూ ఐఏ దాఖలు చేసింది. మొత్తం 2 ఐఏలపై విచారణ తర్వాత వంశధార ట్రైబ్యునల్‌ తాజాగా తుది ఉత్తర్వులు ఇచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని