కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలి: వెంకయ్యనాయుడు

తాజా వార్తలు

Updated : 31/07/2021 20:02 IST

కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలి: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: మాతృభాష సంరక్షణకు సృజనాత్మక విధానాలపై దృష్టి సారించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు కూటమి సంస్థ నిర్వహించిన భాషాభిమానుల  అంతర్జాల సదస్సులో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వెయ్యిమందికి పైగా తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణకు ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని, పరిపాలనలోనూ మాతృభాష ప్రస్పుటించాలని ఆకాంక్షించారు. కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలని, సాంకేతిక విద్యలోనూ పెద్దపీట వేయాలన్న ఉప రాష్ట్రపతి  .. కుటుంబ సభ్యులు తెలుగులోనే మాట్లాడుకోవాలని సూచించారు. మాతృభాష పరిరక్షణకు వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని