కొవిడ్‌ వ్యాప్తి.. సర్పంచ్‌ పాటల స్ఫూర్తి
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వ్యాప్తి.. సర్పంచ్‌ పాటల స్ఫూర్తి

ప్రకాశం: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ..వైరస్‌పై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ సర్పంచ్‌ ప్రచార సారథిగా మారారు. ఇంటింటికీ, వీధి వీధికీ వెళ్లి కరోనా వల్ల కలిగే నష్టాలను స్వయంగా వివరిస్తున్నారు. మైక్‌లో చైతన్య గీతాలు ఆలపిస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకోకుండా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మివరం సర్పంచి చూపుతున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది.

తెదేపా మద్దతుతో సర్పంచిగా గెలిచిన బాలపర్తి బాలకోటి సామాజిక బాధ్యతగా తన ఊరి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మైక్ పట్టుకొని గ్రామమంతా కలియ తిరుగుతూ కరోనా ముప్పు గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాలపైనా కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతున్నందున మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన పాటలు పాడుతూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.

‘‘అక్కో అక్కో మీ తమ్ముళ్లం వచ్చినమక్క, మాస్కు పెట్టుకో అక్కో’’ అని పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఎంతో అభిమానంతో తనను గెలిపించిన ప్రజల క్షేమం కోరి ఈ విధంగా ప్రచారం చేస్తున్నానని సర్పంచి చెబుతున్నారు. సర్పంచ్‌ బాలకోటి స్ఫూర్తిని గౌరవించి కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నామని గ్రామస్థులు అంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని