మనోధైర్యమే కరోనాకు మందు..

తాజా వార్తలు

Published : 23/04/2021 15:29 IST

మనోధైర్యమే కరోనాకు మందు..

భయం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయన్న డా.ఎం.ఎస్‌.రెడ్డి

ఇంటర్నెట్‌ డెస్క్‌: భయం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని, మనో ధైర్యమే కరోనాకు ఉత్తమమైన మందు అని అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్న వైద్య నిపుణులు డా.ఎం.ఎస్‌.రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలోని వైరాలజీ విభాగంలో దశాబ్దాలుగా సేవలందించిన ఆయన హైదరాబాద్‌లో ఈటీవీతో పలు విషయాలు పంచుకున్నారు. మహమ్మారి దరిచేరకుండా పలు జాగ్రత్తలు సూచించారు. భయం మనిషిలోని రోగనిరోధకశక్తిని తగ్గిస్తుందని, మనోధైర్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మంచి ఆహారం తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ పోతుందన్నారు. వైరస్‌ శాశ్వతం కాదని పేర్కొన్నారు. 

సంప్రదాయ ఆహారమే భారతీయులకు శ్రీరామరక్ష అని డా.ఎం.ఎస్‌.రెడ్డి పేర్కొన్నారు. పెరుగు, పాలు తీసుకోవడం వల్ల భారతీయుల్లో రోగనిరోధకశక్తి ఎక్కువ అని వివరించారు. తీవ్ర జబ్బులు ఉన్న కరోనా రోగుల్లోనే మరణాల రేటు ఎక్కువ అని.. దగ్గు, జలుబు, జ్వరం వస్తే కరోనా అని భయపడాల్సిన పనిలేదన్నారు. అనుమానిత లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందుగా మహమ్మారిపై ప్రజల్లో భయాన్ని తగ్గించాలన్నారు. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చినా.. లక్షణాలు లేకపోతే భయపడాల్సిన పనిలేదన్నారు. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. రోగనిరోధక శక్తి పెంచుకుంటే వైరస్‌లో ఎన్ని మ్యుటేషన్లు వచ్చినా ఏమీ చేయలేవని తెలిపారు. ఇంట్లో మజ్జిగ చేసుకొని 12 గంటలు నిల్వ ఉంచి వాడితే చాలా మంచిదన్నారు. చెంచాతో కాకుండా చేతితో కలుపుకొని తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని