AP news: వీఐటీ-ఏపీ చేయూత.. వారికి ₹62 లక్షల స్కాలర్‌షిప్పులు

తాజా వార్తలు

Published : 04/08/2021 21:17 IST

AP news: వీఐటీ-ఏపీ చేయూత.. వారికి ₹62 లక్షల స్కాలర్‌షిప్పులు

అమరావతి: కొవిడ్‌-19 కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఆంధ్రప్రదేశ్‌ (వీఐటీ-ఏపీ) చేయూతనిస్తోంది. 25 మంది విద్యార్థులకు రూ.62 లక్షలు విలువైన స్కాలర్‌షిప్పులను 100 శాతం ఫీజు మినహాయింపు రూపంలో అందిస్తున్నామని వీఐటీ ఫౌండర్‌, ఛాన్సలర్‌ డాక్టర్‌ జి. విశ్వనాథన్‌ తెలిపారు. ప్రస్తుతం వీరు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వారి చదువుకు ఆటంకం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వీఐటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎస్వీ కోట రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే కొవిడ్‌ కట్టడికి తమ వంతుగా ఏపీ ప్రభుత్వానికి రెండు విడతలుగా రూ.75 లక్షలు విరాళంగా అందించామని, కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వీఐటీ-ఏపీ భవనాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చామని గుర్తుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని