వీఐటీ- ఏపీ యూనివర్సిటీతో MKCI ఎంఓయూ

తాజా వార్తలు

Published : 21/07/2021 22:14 IST

వీఐటీ- ఏపీ యూనివర్సిటీతో MKCI ఎంఓయూ

అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త పరిశోధనలకు సన్నద్ధం కావడమే లక్ష్యంగా మిట్సుయ్ కిన్జొకు కాంపోనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (MKCI), వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ)-ఏపీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ విభాగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ నెల 20న వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల ముఖ్య ప్రతినిధులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎస్వీ కోటా రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో అధ్యాపకులు, విద్యార్థులు సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ రంగాల్లో అధునాతన స్థాయి పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా వారు తగినంత పరిశోధనాత్మక పరిధిని కూడా పెంచుకొనేందుకు, పలు వృత్తి అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సహాయపడుతుందని తెలిపారు. పారిశ్రామిక కన్సల్టెన్సీలతో కలిసి అత్యుత్తమ పరిశోధనా ప్రాజెక్టుల్ని తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. దీనిద్వారా శిక్షణా కార్యక్రమాలు, అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు వంటివి కలిసి నిర్వహించవచ్చన్నారు. పరిశ్రమల రంగానికి చెందిన నిపుణులు విద్యార్థులతో తమ జ్ఞానాన్ని పంచుకోవడమే కాకుండా ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను అభివృద్ధికి, పాఠ్యాంశాల తయారీకి వారి నైపుణ్యాలను ఉపయోగించుకొనే వీలు ఉంటుందని తెలిపారు. 

ఈ సహకారంతో పరిశ్రమలు, అకాడమియాను ఏకతాటిపైకి తీసుకురావాలని ఎంకేసీఐ ఎండీ షిమాడ మసకాజు అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం పారిశ్రామిక నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి ఉమ్మడిగా పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. అనేక పేటెంట్లను సంయుక్తంగా ప్రచురించడంతో పాటు మంజూరు చేయవచ్చని తెలిపారు. ఈ ఎంఓయూ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్, కెరీర్ డెవలప్‌మెంట్‌ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి సీహెచ్, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ డీన్ డాక్టర్ శాంతను మండల్, విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పరమ శివం ఆర్, MKCI R&D సలహాదారు డాక్టర్ ఇడో యుహీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (Admin) ఎంఎస్ చినో షోకో, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (HR) దేబసిస్ మహంతి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (R&D) డాక్టర్‌ రాజేష్ కొడియత్ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని