VIT AP: న్యాయ వ్యవస్థ బలోపేతానికి దోహదం
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 14:13 IST

VIT AP: న్యాయ వ్యవస్థ బలోపేతానికి దోహదం


వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న వీఐటీ (ఏపీ) వీసీ డా. కోటారెడ్డి, 
ఆల్పా పార్ట్‌నర్‌ వ్యవస్థాపకుడు అక్షత్‌పాండే, రిజిస్ట్రార్‌ శివకుమార్‌ తదితరులు

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలోని వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయంలో మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగిన సమావేశంలో వీఐటీ (ఏపీ) స్కూల్‌ ఆఫ్‌ లా, దిల్లీకి చెందిన ఆల్పా పార్ట్‌నర్స్‌, ఎన్సీఆర్‌ మధ్య ఎంఓయూ కుదిరింది. వీఐటీ వైస్‌ ఛాన్సలర్‌ డా.ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం న్యాయ విద్యార్థులకు సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ లా, న్యాయ నిపుణులకు చట్టంలో పరిశోధన పాటు న్యాయ వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుందని అన్నారు. న్యాయపరమైన అంశాల్లో సమాజానికి మెరుగైన పరిష్కారాలు చూపడంతో పాటు ప్రజలకు చట్టపరమైన సాధికారిత కల్పించడానికి సహకరిస్తుందన్నారు. విద్యార్థులకు కార్పొరేట్‌ లా, కమర్షియల్‌, రెగ్యులేటరీ సర్వీసెస్‌, కార్మిక, ఉపాధి చట్టాలు, వివాదాలు, పరిష్కారాలు తదితరాల్లో ప్రాక్టీస్‌ చేయడానికి వినియోగపడుతుందన్నారు. ఆల్పా పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు అక్షత్‌పాండే మాట్లాడుతూ విద్య పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు లా విద్యార్థుల సామర్థ్యం పెంపు, ఇంటర్న్‌షిప్‌, ప్లేస్‌మెంట్‌ కార్యకలాపాలు సులభతరం అవుతాయన్నారు. సమావేశంలో వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా.సీఎల్వీ శివకుమార్‌, వీఐటీ (ఏపీ) స్కూల్‌ ఆఫ్‌ లా డీన్‌ డా.బెనర్జీ చక్కా తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని