Vizag Steel: 100వ రోజుకు నిరాహారదీక్ష‌లు

తాజా వార్తలు

Updated : 22/05/2021 10:31 IST

Vizag Steel: 100వ రోజుకు నిరాహారదీక్ష‌లు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష‌లు 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స్టీల్ ప్లాంట్ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌ ఉక్కు ప‌రిరక్ష‌ణ, కార్మిక సంఘ నేత‌లు నిర‌స‌న  తెలుపుతున్నారు. నిర‌స‌న‌కు సీపీఎం, సీపీఐ, టీఎన్‌టీయూసీ మ‌ద్ద‌తు తెలిపాయి. రాష్ట్ర‌ ఎంపీలంద‌రూ క‌లిసి ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వ రంగంలోనే కొన‌సాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త‌న నిర్ణ‌యాన్ని ఉప సంహ‌రించుకునే వ‌ర‌కూ ఉద్య‌మాన్ని ఆప‌బోమ‌ని నిర్వాసిత గ్రామాల ప్ర‌జ‌లు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం ప‌ట్ల కార్మికులు, నిర్వాసితులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని