‘ఆ ఇద్దరి మృతికి ఆక్సిజన్‌ కొరత కారణం కాదు’

తాజా వార్తలు

Published : 26/04/2021 10:03 IST

‘ఆ ఇద్దరి మృతికి ఆక్సిజన్‌ కొరత కారణం కాదు’

మహారాజా ఆస్పత్రిలో లో ప్రెజర్‌ ఆక్సిజన్‌ సమస్య
వెల్లడించిన విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో లో ప్రెజర్‌ ఆక్సిజన్‌ సమస్య వచ్చిందని.. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఆస్పత్రిలో మొత్తం 290 మంది కొవిడ్‌ రోగులు ఉన్నారని.. వారిలో 25 మందికి ఐసీయూలో ఆక్సిజన్‌తో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారని.. వారు చనిపోవడానికి ఆక్సిజన్‌ కొరత కారణం కాదని వైద్యులు చెప్పారన్నారు.. మరణాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు కలెక్టర్ సూచించారు.

మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని హరిజవహర్‌లాల్‌ తెలిపారు. విశాఖ, పైడిబీమవరం నుంచి ఆక్సిజన్‌ తెప్పిస్తున్నామన్నారు. ఐసీయూలో ఉన్న రోగులను రిఫరల్‌ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తే దానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని