జనాలతో ఉండలేకపోతున్నా.. జైల్లో పెట్టండి

తాజా వార్తలు

Published : 20/02/2021 00:55 IST

జనాలతో ఉండలేకపోతున్నా.. జైల్లో పెట్టండి

లండన్‌: కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో అందరూ నాలుగు గోడల మధ్యే బంధీలయ్యారు. ఆ సమయాన్ని కొందరు సద్వినియోగం చేసుకొంటే, మరికొందరు ఖాళీగా ఉంటూ గడిపేశారు. ఎప్పుడూ ఉరుకులు పరుగులతో జీవించే చాలా మంది ఇళ్లలో ఉండలేకపోయారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన ఘటనే ఇది. కానీ ఇతడు అందరిలా కాదు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఉండలేక నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఓ వ్యక్తి లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు గోడల మధ్య ఎక్కువ సమయం ఉండటంతో పాటు, తాను ప్రస్తుతం జీవిస్తున్న మనుషులతో ఉండటం కంటే జైల్లోనే ప్రశాంతంగా ఉంటుందని భావించి యూకేలోని ససెక్స్‌ పోలీసులకు లొంగిపోయాడు. తనను జైల్లోనే ఉంచాలని కోరుతూ ఆ వ్యక్తి బుధవారం బర్గస్‌హిల్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయాన్ని డారెన్‌ టేలర్‌ అనే పోలీసు అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతడు లొంగిపోయిన అనంతరం జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో అతడు ఒంటరిగా తనతో తాను గడపటం ఎంతో ముఖ్యమని డారెన్‌ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని