పాడైన వందల కేజీల మధ్యాహ్న భోజన బియ్యం

తాజా వార్తలు

Published : 02/12/2020 23:53 IST

పాడైన వందల కేజీల మధ్యాహ్న భోజన బియ్యం


ఇంటర్నెట్ డెస్క్‌ : ఓవైపు మనదేశంలో ఎంతోమంది ఆహారం కోసం అలమటిస్తుండగా.. మరోవైపు కొందరి నిర్లక్ష్యం వల్ల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థుల కోసం బోధన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సరఫరా చేసిన 16 క్వింటాళ్ల బియ్యం పాడయ్యాయి. వీటి గురించి 8 నెలలుగా ఎవరూ పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌కు ముందు మధ్యాహ్న భోజనంలో ఉపయోగించటం కోసం ఈ బియ్యాన్ని సరఫరా చేశారు. కానీ పాఠశాలలు మూతపడటంతో వీటికి పురుగులు పట్టాయి. కొంత బియ్యాన్ని ఎలుకలూ తినేశాయి. ఈ విషయం గురించి సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడారు. బియ్యాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని