రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
close

తాజా వార్తలు

Published : 13/06/2021 16:16 IST

రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  వాయువ్య బంగాళాఖాతం పరిసర పశ్చిమ బెంగాల్‌ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్‌ స్థాయి వరకు వ్యాపించింది. రాగల రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశముంది. ఈరోజు ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో...
అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో  ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో  కూడిన జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని