TS NEWS: రాగల 3రోజులు తేలికపాటి వర్షాలు
close

తాజా వార్తలు

Published : 15/06/2021 15:09 IST

TS NEWS: రాగల 3రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌: రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఝార్ఖండ్‌, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదన్నారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులతో కూడిన వర్షం పడనున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని