Viral: విస్కీ బాటిల్‌.. రూ.1 కోటి!

తాజా వార్తలు

Published : 19/07/2021 01:08 IST

Viral: విస్కీ బాటిల్‌.. రూ.1 కోటి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత పాతదిగా భావిస్తున్న ఓ విస్కీ బాటిల్‌ను ఇటీవల వేలం వేశారు. అయితే అది పలికి ధర తెలిస్తే  షాక్‌ అవక తప్పదు. అవును.. 250 ఏళ్ల నాటి ఆ బాటిల్‌ వేలంలో అక్షరాలా రూ.1 కోటి ధర పలికింది.  తాజాగా ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సీసాపై ఉన్న లేబుల్‌పై దాని వివరాలున్నాయి. దాని ప్రకారం అందులోని మద్యం బర్బన్‌ విస్కీగా గుర్తించినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. 1860 నాటిదిగా భావిస్తున్న ఈ బాటిల్‌లోని మద్యం అప్పటికన్నా 100 ఏళ్ల పూర్వం నాటిదిగా  అంచనా వేస్తున్నారు. ఆ కాలంనాటి ప్రఖ్యాత సంపన్నుడు జేపీ మోర్గాన్‌ దీనిని సేకరించినట్లుగా చెబుతున్నారు. మోర్గాన్‌  మరణానంతరం ఆయన ఇంటి సెల్లార్‌లో ఇది లభించినట్లు పేర్కొన్నారు. ఈ విస్కీ బాటిల్‌కు 20 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్ల ధర పలుకుతుందని స్కిన్నర్‌ ఇన్‌కార్పొరేషన్‌ సంస్థ అంచనా వేసింది. కానీ అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అది 1,37,500 డాలర్లకు అమ్ముడుపోయింది. అయితే అందులోని మద్యం 1763 నుంచి 1803 మధ్య కాలంలో తయారు చేసి ఉండవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని