nehru zoological park: తెల్ల పులి పిల్లల సందడి చూశారా?

తాజా వార్తలు

Published : 03/08/2021 23:00 IST

nehru zoological park: తెల్ల పులి పిల్లల సందడి చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో బెంగాల్ టైగర్ తెల్ల పులి దివ్యాని దాని నాలుగు పిల్లలు నీటిలో ఆడుతూ ఉరుకులు, పరుగులు పెడుతూ సందడి చేస్తున్నాయి, ఈ దృశ్యాలు చూసి సందర్శకులు తెగ ఆనందపడుతున్నారు. జూ పార్క్‌లోనే 8 ఏళ్ల క్రితం జన్మించిన దివ్యాని అనే ఆడ తెల్ల పులి 10 నెలల క్రితం 3 ఆడ, 1మగ మొత్తం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా తెల్లపులులు 2 పిల్లలనే కంటాయి. ఈ పులి మాత్రం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు జూలో తెల్లపులుల సంఖ్య 11కు చేరింది. కరోనా నేపథ్యంలో జూ సిబ్బంది వాటిని ప్రత్యేకంగా సంరక్షించారు. అలా పెరిగి పెద్దవైన పిల్లలను సందర్శకుల కోసం మధ్యాహ్నం వరకే ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్నారు. బోనులో నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్న కూనలు, వాటి వెంటే తల్లి పులి తిరగడం కనువిందు చేస్తోంది.  కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు అనుమతి ఇస్తున్నట్లు జూ అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని