కరోనా ప్రభావం వ్యక్తులపై వేర్వేరుగా ఎందుకంటే...

తాజా వార్తలు

Published : 14/08/2020 02:08 IST

 కరోనా ప్రభావం వ్యక్తులపై వేర్వేరుగా ఎందుకంటే...

టొరంటో: కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా సోకిన ఈ మహమ్మారి‌.. ఇప్పటి వరకు సుమారు ఏడు లక్షలకు మించి ప్రాణాలను బలితీసుకుంది. అయితే కొవిడ్‌-19 సోకిన వారిలో 1 కోటి 37 లక్షల మందికి పైగా బయటపడటం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్‌ ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉండటాన్ని వైద్య నిపుణులు గమనించారు. కొందరు వ్యక్తులు దీనిని సమర్థంగా ఎదుర్కోగలుగుతుండగా.. కొంతమంది విఫలమవుతున్నారు. ఈ అంశంపై కెనడాలోని మెక్‌ మాస్టర్‌ యూనివర్సిటీ, వాటర్లూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.

ఇతర కారణాలున్నాయి..

కొవిడ్‌-19 వైరస్‌ మానవ కణాల్లోకి వాటి ఉపరితలంలో ఉండే ఏసీఈ2 అనే గ్రాహకం (రిసెప్టర్‌) ద్వారా ప్రవేశిస్తుందని భావిస్తూ వస్తున్నారు. అయితే మానవ ఊపిరితిత్తుల్లో ఈ గ్రాహకం అతి తక్కువ స్థాయిలో ఉందని తాజా పరిశోధనల్లో తెలిసింది. అయినప్పటికీ కొవిడ్‌ ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. దీనితో శరీరంలో వైరస్‌ ప్రవేశానికి ఇతర గ్రాహకాలు కూడా దోహదం చేస్తున్నాయని శాస్త్రజ్ఞులు వివరించారు. కొవిడ్‌ వైరస్‌, మనిషి ఊపిరితిత్తుల్లోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది అనే అంశంపై శాస్త్రీయ రీతిలో ఇప్పటి వరకు పరిశోధన జరగలేదని వారు అంటున్నారు. ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు తాము కరోనా బాధితుల ముక్కు నుంచి తీసుకున్న నమూనాలపై పరీక్షలు జరుపుతున్నామన్నారు.

వ్యక్తుల ఊపిరితిత్తుల్లో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థలో భేదాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. దీని వల్లే ఆయా వ్యక్తుల వ్యాధి నిరోధకత వివిధ స్థాయి కూడా వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. కాగా, బాధితుల్లోని ఏ జన్యువులు వ్యాధి అధికమయ్యేందుకు దోహదం చేస్తాయో తెలుసుకొనేందుకు తాము మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని పరిశోధకులు తెలిపారు. దీని ద్వారా తీవ్ర ప్రభావం ఉండగల వారిని గుర్తించి, అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని