మహిళకు న్యాయం చేయాలని కేటీఆర్‌కు కర్ణాటక నేత విజ్ఞప్తి
close

తాజా వార్తలు

Published : 31/05/2021 01:05 IST

మహిళకు న్యాయం చేయాలని కేటీఆర్‌కు కర్ణాటక నేత విజ్ఞప్తి

హైదరాబాద్‌: కర్ణాటకలోని మాండ్యాకు చెందిన మహిళ కుటుంబానికి సాయమందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ నేత డి.కె.శివకుమార్‌ విజ్ఞప్తి చేశారు. మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మృతిచెందారని, ఆసుపత్రి యాజమాన్యం రూ.7.5 లక్షల బిల్లు వేసినట్లు ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. రూ.2 లక్షలు చెల్లిస్తామన్నా మృతదేహాన్ని అప్పగించలేదని తెలిపారు. శివకుమార్‌ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాధితురాలి వివరాలు తెలియజేయాల్సిందిగా శివకుమార్‌ను కోరారు. మహిళ, ఆసుపత్రి బిల్లు వివరాలు తెలుసుకోవాలని తన సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని