hyderabad news: రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌

తాజా వార్తలు

Updated : 31/07/2021 20:48 IST

hyderabad news: రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌

హైదరాబాద్‌: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ మహానగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్లు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తారని తెలుసుకున్న మందుబాబులు ముందుగానే మద్యం కొనుగోలు చేసి దాచి పెట్టుకుంటున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని