గర్భం దాల్చిన కొద్దిరోజులకు మరో గర్భం..

తాజా వార్తలు

Published : 10/04/2021 11:15 IST

గర్భం దాల్చిన కొద్దిరోజులకు మరో గర్భం..

ఇంగ్లాండ్‌లో అరుదైన ఘటన

లండన్‌: ఇంగ్లాండ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గర్భం దాల్చిన తర్వాత ఓ మహిళ శరీరంలో అండాలు ఉత్పత్తి కావడం అద్భుతమైతే.. కొద్ది రోజుల్లోనే మరో గర్భం దాల్చిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోజుల తేడాతో పిండాలుగా రూపాంతరం చెందినప్పటికీ.. ఒకే రోజు పుట్టడం, ఇద్దరూ క్షేమంగా ఉండటం వైద్య వర్గాలను సైతం ఆలోచింపజేస్తోంది. మొదట ఒక బిడ్డతో గర్భం దాల్చిన రెబెక్కా రాబర్ట్స్‌.. కొద్ది వారాలకే మరో బిడ్డను కూడా కడుపులో మోస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 

పిల్లలు పుట్టడం లేదంటూ అనేక ఆసుపత్రులకు తిరిగిన రెబెక్కా ఎట్టకేలకు గర్భం దాల్చినట్లు తెలుసుకొని సంతోషంలో మునిగిపోయింది. ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లో ఒక బిడ్డ ఉన్నట్లు తెలుసుకొన్నారు రెబెక్కా-రీస్‌ వీవర్స్‌ దంపతులు. అయితే పిండానికి 12 వారాల వయసు ఉన్న సమయంలో మరోసారి పరీక్షలు జరపగా.. కడుపులో మరో పిండం ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులతోపాటు ఆ దంపతులు కూడా షాక్‌కు గురయ్యారు. ఇద్దరు బిడ్డల మధ్య కొద్ది వారాల తేడా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. ఇది అరుదైన ఘటనగా పేర్కొన్నారు. 

మొదట గర్భం దాల్చిన 3, 4 వారాల తర్వాత మరో అండం రెబెక్కా శరీరంలో విడుదలైనట్లు వైద్యులు తెలిపారు. అద్భుత రీతిలో అది పిండంగా మారిందని వివరించారు. అయితే చిన్న బిడ్డలో ఎదుగుదల సరిగ్గా లేదని, పుట్టినా ఆమె జీవించి ఉండలేకపోవచ్చేమోనని భావించారు. కానీ గతేదాడి సెప్టెంబర్‌ 17న రెండు నిమిషాల వ్యవధిలో రెబెక్కా ఇద్దరు బిడ్దలకు జన్మనిచ్చింది. మగబిడ్డ (పెద్దవాడు) 4 పౌండ్ల 10 ఔన్సులు, ఆడబిడ్డ 2 పౌండ్ల 7 ఔన్సుల బరువు ఉన్నారు. ఇద్దరినీ కొద్ది రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ వారి చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నట్లు రెబెక్కా దంపతులు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని