కరోనా తగ్గేవరకు దర్శనాల సంఖ్య పెంచం
close

తాజా వార్తలు

Updated : 30/07/2020 19:44 IST

కరోనా తగ్గేవరకు దర్శనాల సంఖ్య పెంచం

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: కరోనా ప్రభావం తగ్గే వరకూ దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కరోనా బారిన పడిన అర్చకులు, సిబ్బంది కోలుకున్నారని చెప్పారు. ‘‘త్వరలో ఆన్‌లైన్‌లో స్వామివారి కల్యాణోత్సవం టికెట్లు అందుబాటులోకి తెస్తాం. టికెట్లు తీసుకున్న భక్తుల గోత్రనామాలతో కల్యాణోత్సవం నిర్వహిస్తాం. తపాల ద్వారా కల్యాణోత్సవం అక్షతలు, వస్త్రాలు పంపుతాం’’అని సుబ్బారెడ్డి వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని