వెన్నునొప్పి తగ్గించే యోగాసనాలు

తాజా వార్తలు

Published : 06/06/2021 01:03 IST

వెన్నునొప్పి తగ్గించే యోగాసనాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మనం ఏం పని చేయాలన్నా మన వెన్నెముక సహకరించాలి. బరువులు ఎత్తాలన్నా, వంగి పనిచేయాలన్నా, సరిగా కూర్చోవాలన్నా వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవన శైలి, అలవాట్లు రోజువారి భంగిమల మూలంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి రోజు రోజుకూ బలహీనంగా మారుతోంది. చాలామందిలోని వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉన్న నరాలపై ఒత్తిడి పెరిగి నడుము నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నడుమునొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సాధన చేస్తుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు.  

ప్రస్తుతం చాలామందిని డిస్క్‌ ప్రొలాప్స్‌ సమస్య వేధిస్తోంది. దీని వల్ల విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు. పడుకుంటే మాత్రం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కొంతమందిలో ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో మానసిక క్షోభతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు యోగా చేయడం ద్వారా 80 నుంచి 90 శాతం ఉపశమనం పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెన్నునొప్పి తగ్గించడానికి సేతుబంధాసనం, మేరు దండ ముద్ర ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు.  ఈ ఆసనాలు, యోగా ముద్రలు ఏ విధంగా చేయాలో కింద వీడియోలో చూడండి. 
(గమనిక: ఆసనాలు వేసే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆసనాలు వేయాలి)



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని