close

తాజా వార్తలు

వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం

మృతుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

మంచంపై పుష్పవల్లి మృతదేహం

గురుద్వారా: భర్తతో మనస్పర్థల కారణంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెడ్డ పుష్పవల్లి(32)కి మహేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి అమల (7) అనే పాప ఉంది. బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని శ్రీరామ అపార్టుమెంట్‌లోని 8వ అంతస్తులో నివశిస్తున్నారు. బుల్లయ్య కళాశాలలో పుష్పవల్లి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భర్త గత కొంతకాలంగా ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా మాటల యుద్ధం జరగడంతో మనస్తాపం చెంది రాత్రి పడక గదిలో తాడుతో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి పి.సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఫైనాన్స్‌ వ్యాపారి ఆత్మహత్య

గాజువాక న్యూస్‌టుడే: గాజువాక దరి గొంతెనవానిపాలెంలో ఫైనాన్స్‌ వ్యాపారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గాజువాక ఎస్‌ఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫైనాన్స్‌ వ్యాపారి కర్రి సూర్రెడ్డి(33) గొంతెనవానిపాలెంలోని ఓ అద్దె ఇంట్లో భార్య పుష్ప, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఐదు రోజుల క్రితమే భార్య, పిల్లలు అనపర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం భార్య ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సూర్రెడ్డి స్పందించలేదు. దీంతో ఆమె గాజువాకలో ఉంటున్న సూర్రెడ్డి సోదరుడు వెంకటరెడ్డికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వెంకటరెడ్డి గొంతెనవానిపాలెం వచ్చి చూడగా.. ఇంటి లోపల వైపు నుంచి గడియ పెట్టి ఉంది. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు విరగకొట్టి లోపలికి ప్రవేశించగా సూర్రెడ్డి ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న అతని భార్య మధ్యాహ్నం ఇక్కడకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామారావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్ర మనస్తాపానికి గురై ప్రేమికుడు...

రామకృష్ణంరాజు మృతదేహం

గ్రామీణభీమిలి: భీమిలి బీచ్‌రోడ్డులో రామాద్రి వద్ద ముదునూరు రామకృష్ణంరాజు(27) అనే యువకుడి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయ్యింది. భీమిలి ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈయన విశాఖ ద్వారకానగర్‌లోని ఇన్విన్సిబుల్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ లో పనిచేస్తున్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా మెరకముడిదాం. సీతమ్మధార దరి కేఆర్‌ఎం కాలనీలో వీరి కుటుంబం మూడు దశాబ్దాల కిందట స్థిరపడింది. రాజు ప్రేమించిన అమ్మాయికి ఈ నెల 26న వివాహం నిశ్చయమయ్యింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాడు. కుటుంబసభ్యులు పటుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఉదయం ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇదే సమయంలో తొట్లకొండ తీరంలో మృతదేహం లభించడంతో ఆ ఫొటోలను పోలీసులు చూపించారు. వాటిని చూసి హతాశులైన తల్లిదండ్రులు వెంటనే కేజీహెచ్‌ మార్చురీకి వెళ్లారు. తండ్రి రామరాజు గీతం కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఎస్‌ఐ పి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.