close

తాజా వార్తలు

సహజ సిద్ధమైన వ్యవసాయమే మేలు

రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌

విజయనగరం: పెట్టుబడిలేని సహజ సిద్ధమైన వ్యవసాయమే మేలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ఖరీఫ్‌ సీజన్‌లో అమలు చేసే వివిధ పథకాలకు సంబంధించి జిల్లాస్థాయి అవగాహన సదస్సు మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి.రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే కాలంలో వ్యవసాయం లాభదాయకంగా మారేందుకు వ్యవసాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించాలన్నారు. రైతులకు సానుకూలంగా ఎప్పటికప్పుడు ఆధునిక పోకడలపై అవగాహన కల్పించాలని, సాగు, అంతరపంటలతో మెరుగైన ఆదాయం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలోనే పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని, పెట్టుబడి లేని వ్యవసాయంపై రైతులను ఆకర్షితులను చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ.. రానున్న సీజన్‌లో ఉపాధిహామీ పథకం నిధుల్లో 50 శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించనున్నామని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూనే.. వ్యవసాయ రంగానికి మరింత ప్రాముఖ్యత ఇస్తున్నామని అన్నారు. జిల్లాకు వ్యవసాయమే ఆధారమని, పెట్టుబడిలేని వ్యవసాయమే ధ్యేయంగా పురోగమిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. జిల్లాకు పేరు తెచ్చే విధంగా వ్యవసాయ సిబ్బంది పనిచేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.