close

తాజా వార్తలు

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి  


నుజ్జునుజ్జు అయిన ఆటో

 

జలదంకి, న్యూస్‌టుడే: జిల్లాలో జగిరిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ద్విచక్రవాహనచోదకుడు ఆటోను అధిగమించబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని, ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృత్యువాత పడగా నలుగురికి గాయాలైన సంఘటన జలదంకి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై యం.ఆంజనేయులు తెలిపిన వివరాలు... నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన గుత్తేదారుడు అలపాక కిషోర్‌(28) కావలి పట్టణంలో వివాహం చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కావలి మండలంలోని కొత్తపాలెం చెరువు మరమ్మతులు పనులు చేయిస్తున్న కిషోర్‌ జలదంకి మండలంలోని అన్నవరం క్వారీకి కంకర కోసం బైక్‌పై వెళ్లి తిరిగి బయలుదేరాడు. ఇదేసమయంలో కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామానికి చెందిన బి.వెంకటకిషోర్‌ కుమార్‌ కావలి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డుపై తన ముందు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను అధిగమించబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కిషోర్‌ ద్విచక్రవాహనాన్ని, ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కిషోర్‌ తలకు బలమైన గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్సకు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ ప్రసాద్‌ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి నుంచి చెరువు పనులు చేయించేందుకు వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకుని కిషోర్‌ భార్య బోరునవిలపించింది. మృతునికి ఒక బాబు ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కిషోర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న కావలి డీఎస్పీ ప్రసాద్‌

కలిగిరిలో

కలిగిరి : కలిగిరి-వింజమూరు ప్రధాన రహదారిపై జిర్రావారిపాలెం కూడలిలో రోడ్డు దాటుతున్న ముగ్గురు వ్యక్తులను వేగంగా వచ్చిన బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... కలిగిరి-వింజమూరు ప్రధాన రహదారిపై జిర్రావారిపాలెం గ్రామం పరిధిలో రోడ్డుకు ఇరువైపులా నివాస గృహాలు ఉన్నాయి. బుధవారం రాత్రి జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నాగేంద్ర, కొప్పోలు మనోజ్‌కుమార్‌, గుమ్మవరపు మల్లేష్‌లు రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో కలిగిరి నుంచి వింజమూరు వైపు వేగంగా వెళుతున్న మోటార్‌సైకిల్‌ వారిని ఢీకొట్టింది. బైకు వేగంగా ఉండటంతో రోడ్డు దాటుతున్న ముగ్గురు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిపోయారు. బైకు నడుపుతున్న కలిగిరికి చెందిన నాటకరాని దుర్గయ్య కొద్దిదూరంలో పడిపోయాడు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైనాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆటోలో కలిగిరిలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకొచ్చారు. నాగేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మృతిచెందాడు.. కలిగిరి ఎస్సై పి.ఆదిలక్ష్మీ ముందుగా ఆసుపత్రికి వచ్చి గాయపడిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బైకు అతివేగంతోనే ప్రమాదం జరిగిందన్నారు.

మృతిచెందిన నాగేంద్ర

 


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.