Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 104017
            [news_title_telugu_html] => 

జలాశయంలో పడి విద్యార్థిని దుర్మరణం

[news_title_telugu] => జలాశయంలో పడి విద్యార్థిని దుర్మరణం [news_title_english] => [news_short_description] => స్నేహితులతో కలసి జలాశయంలో సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నర్శింగ్‌ విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మద్దిపాడు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-27 04:54:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జలాశయంలో పడి విద్యార్థిని దుర్మరణం - EENADU
close

తాజా వార్తలు

జలాశయంలో పడి విద్యార్థిని దుర్మరణం
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చుతున్న దృశ్యం

 

మల్లవరం(మద్దిపాడు), న్యూస్‌టుడే: స్నేహితులతో కలసి జలాశయంలో సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నర్శింగ్‌ విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ జలాశయం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మార్కాపురానికి చెందిన జి.కుమారి అనే యువతి నర్సింగ్‌ మొదటి సంవత్సర విద్యార్థిని. కుటుంబ పరిస్థితుల రీత్యా మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. రెండో ఏడాది ఒంగోలులోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో చదువుకోవాలని ఆకాంక్షించి సీట్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఆదివారం ఉదయం మరో నలుగురు స్నేహితులతో ఇక్కడికి వచ్చారు. వివరాలు సేకరించిన అనంతరం గుండ్లకమ్మ జలాశయం చూసేందుకు వారంతా ఓ ఆటోలో వచ్చారు. అక్కడ కొద్ది సేపు ఆటలాడుకున్నారు. జలాశయం పదహారో గేటు వద్ద నీళ్లలో దిగి స్వీయ చిత్రాలు తీసుకుంటుండగా కుమారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆమె స్నేహితులు కేకలు వేయడంతో పలువురు యువకులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలర్లతో గాలింపులు చేపట్టినా ఉపయోగం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక అధికారి వెంకటేశ్వర్లు సిబ్బంది పడవలో లంగర్లు వేసి గాలింపులు చేపట్టారు. మృతదేహం వెలికి తీసి పోలీసులకు అప్పగించారు. పోస్టుమార్టం నిమిత్తం కుమారి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండురంగారావు తెలిపారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.