close

తాజా వార్తలు

శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ

విశాఖ, ఆనందపురం: మండలంలోని గొట్టుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ పండితులు ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసి షిరిడీ సాయిబాబ, మహాగణపతి, దత్తాత్రేయుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ బి.మణిశంకర నాయుడు, మాజీ ఎమ్మెల్యే సీతారాం, మాజీ ఎంపీపీలు వెంకటరావు, రాజుబాబు, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.