
తాజా వార్తలు
విశాఖ శారదాపీఠం మహోత్సవాల సందడి
ఈనాడు, అమరావతి : విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకారమహోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. శనివారం నుంచి ఆరంభమైన ఉత్సవాలు సోమవారం వరకూ కొనసాగనున్నాయి. ఉండవల్లిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరుగుతున్న ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు తొలిరోజు పాల్గొన్నారు. ఉండవల్లి, కృష్ణాతీరం, ప్రకాశం బ్యారేజీ సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భక్తజనంతో నిండిపోయాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు, విదేశీ భక్తులు పెద్దసంఖ్యలో వేడుకలు జరిగే ప్రాంగణానికి శనివారం చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలోనే వేడుకలు జరిగాయి.
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.. : కృష్ణా కరకట్ట మీద ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లే దారులన్నింటిలోనూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. రేపు జరిగే వేడుకల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు.. జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, పళనిస్వామి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నందున.. పోలీసులు భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేపట్టారు. డీజీపీ గౌతంసవాంగ్, విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు సహా పలువురు పోలీసు అధికారులు శనివారం వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిసి.. ఆశీస్సులు తీసుకుని వెళ్లేందుకు.. అనేకమంది ప్రముఖులు మొదటి రోజు వచ్చారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దగ్గరుండి వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వేడుకలు జరగనున్నాయి.
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
