
తాజా వార్తలు
లబోదిబోమంటున్న వాహనాల యజమానులు
ఎన్నికల సేవలకు వినియోగించుకున్న అధికారులు
ఈనాడు, విశాఖపట్నం: శాసనమండలి, శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో సేవలందించిన అద్దె వాహనాలవారికి యంత్రాంగం ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేని వాటి యజమానులు, డ్రైవర్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో దాదాపు 45 రోజులపాటు 600 మంది సేవలందించారు. మండలి ఎన్నికల కోసం 12 రోజులు, సార్వత్రిక ఎన్నికల కోసం 33 రోజులు వాహనాలను అద్దెకు నడిపారు. నిబంధనల ప్రకారం రోజువారీ అద్దె, డ్రైవరు బేటా ఏ రోజుకారోజే చెల్లించాలి. మొదట్లో రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్ ఇచ్చిన అధికారులు మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులూ జరపలేదు. నెలవారీ రుణబకాయిలు చెల్లించడానికి చేతిలో డబ్బుల్లేక అప్పులు చేస్తున్నామని కొందరు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని మరికొందరు డ్రైవర్లు ‘ఈనాడు’ వద్ద ఆవేదన చెందారు. బకాయిలు, వడ్డీ చెల్లించని 50 మంది వాహనాలను స్వాధీనం చేసుకుంటామంటూ బ్యాంకర్లు నోటీసులిచ్చారు. మరికొందరు రుణదాతలు సుమారు రూ. 5 వేల వరకు అపరాధ రుసుము విధించారు.
*●ఆ ఎన్నికలకు సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 1.05 లక్షల చొప్పున రావాల్సి ఉందని వాహనాల యజమానులు, డ్రైవర్లు చెప్పారు. ఇపుడేమో రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకే ఇస్తామని అధికారులు చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
*●శాసనమండలి ఎన్నికల కోసం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 11 వరకు సేవలందించినందుకు రోజుకు రూ. 2 వేలు, బేటా రూ. 250 ఇస్తామని చెప్పిన అధికారులు ఇపుడు గట్టిగా అడిగితే రూ. 1300, ఆ తరువాత రూ. 1500 ఇస్తామంటున్నారన్నారు.
*●మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకు నిర్వహించిన విధులకుగాను రూ. 40 వేలు, బేటా రోజుకు రూ. 375 చొప్పున ఇస్తామని చెప్పి ఇపుడు రూ. 35 వేలే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని వాటి యజమానులు ప్రశ్నిస్తున్నారు. వాహనాలను 24 గంటలూ ఉపయోగించుకున్నారని చెప్పారు. డబ్బు తగ్గించి ఇస్తే డ్రైవర్ల జీతాలకే ఆ మొత్తం సరిపోతుందన్నారు.
*●దీనిపై జిల్లా అధికారుల వివరణ కోరంగా.. ఎన్నికల విధులకు సంబంధించి బడ్జెట్ రావాల్సి ఉందన్నారు.
వస్తువులు తాకట్టుపెట్టా...
నేను ఎన్నికల కోసం ఒక కారును అద్దెకు పెట్టా. ఆ వాహనానికి ఈఎంఐ సకాలంలో చెల్లించాలి. ఎన్నికల డబ్బులు అందకపోవటంతో.. గడువులోగా ఈఎంఐ చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు కుటుంబ సభ్యులకు చెందిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకొని మరీ బ్యాంకుకు చెల్లించాల్సి వచ్చింది. నాలాగే ఎంతోమంది రుణబకాయిల చెల్లింపుల కోసం అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బకాయిలు చెల్లించేలా చూడాలి. - రాజు, కారు డ్రైవర్ల సంఘ ప్రతినిధి
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
