close

తాజా వార్తలు

సంక్షేమమే ప్రదానం

● ఎస్వీ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌పై విచారణ ●

కలెక్టర్లలో సదస్సులో సీఎం జగన్‌

సీఎం జగన్‌

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే : ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా నవరత్నాలు అమలు చేయాలని, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా సీఎం అధ్యక్షతన రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్‌ భరత్‌ గుప్తా పాల్గొన్నారు. జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్‌, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. తొలి సమావేశం కావడంతో రాష్ట్రవ్యాప్త అంశాలు చర్చకు వచ్చాయని, జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకోలేదని కలెక్టర్‌ వెల్లడించారు. అయితే.. ముఖ్యమంత్రి జగన్‌ ఓ సందర్భంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై మాట్లాడుతూ.. తిరుపతిలోని ఎస్వీ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఈ కళాశాలలో సౌకర్యాలు లేవని, ప్రమాణాల మేరకు సిబ్బంది లేరంటూ కళాశాల విద్యార్థులు తనకు రాసిన ఉత్తరాన్ని సీఎం స్వయంగా కలెక్టర్ల సమావేశంలో చదివి విన్పించడం గమనార్హం. దీనిపై విచారణ జరపాల్సిందిగా భరత్‌ గుప్తాను ఆదేశించారు.

పథకాలే ప్రధాన అజెండా: సదస్సులో సీఎం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నవరత్నాల ప్రణాళిక అమలో భాగంగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు విధి విధానాలు, గ్రామ సచివాలయాలపై దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో విద్య, వైద్య సేవలు మరింత సమర్థంగా ప్రజలకు అందించడంలో భాగంగా ఉన్నతాధికారులు ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. రాత్రి సమయాల్లో పీహెచ్‌సీ, వసతిగృహాల్లో బస చేయాలని, ఉదయం గ్రామంలోని రైతులు, ప్రజలతో రచ్చబండ నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. నవరత్నాల పథకం అమలు, నిధుల అవసరం వంటి వివరాలతో శాఖల వారీగా తయారు చేసిన నివేదికలను జిల్లా పాలనాధికారి భరత్‌ గుప్తా ముఖ్యమంత్రికి అందించారు. ఇదే సమయంలో కరవు పరిస్థితులు, తాగనీటి సమస్య, పశుగ్రాసం కొరత నివారణకు సంబంధించి వివరాలను సీఎంకు నివేదించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.