Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా డిమాండ్‌

సమావేశంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జిల్లాలో ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు ఎక్కువగా ఉందన్నారు. అయితే కరవు బారిన పడి ఈ పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎంతో కాలంగా కష్టపడి పెంచుకున్న చెట్లు కళ్లముందే ఎండిపోతుంటే రైతుల ఆవేదన మాటలకు చెప్పలేనిదన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 2014 ఎన్నికలకు ముందు భాజపాపై కొందరు విషప్రచారం చేశారన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్రంలోని ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని అందుకే భాజపాలోకి వచ్చి చేరుతున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు నెల్లూరు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి. సురేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన