close

తాజా వార్తలు

ప్లాస్టిక్‌ కవర్ల పట్టివేత

ఆదోనిమార్కెట్‌: ఆదోని పట్టణంలో ప్రైవేట్‌ రవాణాలో సంస్థలో రూ.50 వేల విలువ చేసే ప్లాస్టిక్‌ కవర్లను శుక్రవారం పురపాలక అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పురపాలక కమిషనర్‌ కన్యాకుమారి నేతృత్వంలో రవాణా సంస్థపై దాడులు చేసి ఈ ప్లాస్టిక్‌ కవర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించడం జరిగిందన్నారు. 50 మైక్రాన్లలోపు ఉన్న కవర్ల వాడకం హానికరమని పేర్కొన్నారు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తే దుకాణాల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు  హరినాథ్‌, రవి, మేస్త్రి తిమ్మప్ప, సంకల్ప్‌ సమన్వకర్త రఘు, సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.