Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేణిగుంట: రేణిగుంట చెక్‌పోస్టు కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున ఓ పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు విశాఖపట్నం నుంచి బెంగుళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ఓల్వో బస్సు ఉదయం 5గంటలకు రేణిగుంట చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. ఈ సమయంలో బస్సు చోదకుడు టీ తాగేందుకు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వేగంలో ఉన్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. బస్సు రోడ్డుపక్కనే ఉన్న లగేజీ ఆటోపై ఒరిగిపోయింది. దీంతో బస్సు బోల్తాపడకుండా ఆటో దన్నుగా నిలిచిపోయింది. ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న రేణిగుంట పట్టణ పోలీసులు జేసీబీ సాయంతో బస్సును యధాస్థితికి తెచ్చారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన