Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆనందపురం(విశాఖపట్నం): మండలంలోని పలుప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు కుట్టియాడ సత్యమూర్తి రాతపుస్తకాలను అందజేశారు. దీనిలో భాగంగా పొడుగుపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏడాదికి సరిపడా నోటుపుస్తకాలను అందించారు. విద్యార్థులు ఉత్తమ విలువలతో చదువుకోవాలని దీనికి తమ వంతు సహకారం అందిస్తామని సత్యమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉషారాణి, శ్రీరామ్‌, మురళి, గ్రామయువకులు వి.శంకర్‌రావు, బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన