Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదోనిమార్కెట్‌: ఆదోని పట్టణంలో ఎయిడెడ్‌ పాఠశాలలను శుక్రవారం సీపీఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎయిడెడ్‌ పాఠశాలల నిర్వహణ ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువు కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, గోపాల్‌, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన